Budget 2022: రసాయనాలు వాడకుండా వ్యవసాయం.. పైలెట్ ప్రాజెక్ట్ ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-02-01T17:27:40+05:30 IST

కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతున్న మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

Budget 2022: రసాయనాలు వాడకుండా వ్యవసాయం.. పైలెట్ ప్రాజెక్ట్ ఎక్కడంటే..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతున్న మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్లలోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధాన్ని ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌లో మార్పు చేసి సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కోరారు.


ఆర్గానికి ఫార్మింగ్‌, మోడ్రన్-డే అగ్రికల్చర్‌లకు ప్రోత్సహకాలను తగ్గించాలని తెలిపారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యానికి రసాయనాలు వాడి పండిస్తున్న ఆహార పదార్థాలు ఎంతమాత్రం మంచివి కావని మంత్రి అభిప్రాయపడ్డారు. కనుక కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయం ఈ సమయంలో చాలా అవసరం అన్నారు. ఇక సేంద్రియ వ్యవసాయం అనేది ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది.  

Updated Date - 2022-02-01T17:27:40+05:30 IST