హైదరాబాద్: నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా టూ వే ట్రాఫిక్‌ను ఏర్పాటు చేశారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుంది. షేక్‌పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.
ఇవి కూడా చదవండి