నేడు మంత్రి కేటీఆర్‌ రాక

ABN , First Publish Date - 2022-06-04T04:38:23+05:30 IST

దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలకు రంగం సిద్ధమైంది. నియోజక వర్గంలో రూ.119 కోట్లతో చేపట్టిన పలు పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలు చేయనున్నారు.

నేడు మంత్రి కేటీఆర్‌ రాక
భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ వద్ద ప్రారంభానికి సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి

దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపనలు



మహబూబ్‌నగర్‌, జూన్‌ 3(ఆంరఽధజ్యోతి ప్రతినిధి): దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలకు రంగం సిద్ధమైంది. నియోజక వర్గంలో రూ.119 కోట్లతో చేపట్టిన పలు పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి స్థానికంగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్‌ పర్య టన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ వద్ద ప్రగతి సభను కూడా నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.అజయ్‌కుమార్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. మంత్రులు మధ్యాహ్నం వరకు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించి అనంతరం హెలికాప్టర్‌ ద్వారా కొడంగల్‌ నియోజ కవర్గం కోస్గి మండలంలో పర్యటనకు వెళ్లనున్నారు. 

పేరూరు ఎత్తిపోతల పథకానికి..

దేవరకద్ర మండలంలోని పేరూరు, వెంకంపల్లి, అమ్మాపూర్‌, వెంకటగిరి, రేకు లంపల్లి, దాసరిపల్లి గ్రామాలకు చెందిన 3,500 ఎకరాలకు సాగునీ రందించే నిమిత్తం పేరూరు వద్ద సాగు నీటి పారుదలశాఖ ఆధ్వ ర్యంలో రూ.51 కోట్లతో చేపట్టను న్న ఎత్తిపోతల పథకానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయను న్నారు. అదేవిధంగా భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తా పూర్‌ వద్ద రూ.17 కోట్లతో నిర్మించిన 288 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తారు. అడ్డాకుల మండలంలోని వర్ని, ముత్యాలం పల్లి గ్రామాల మధ్య రూ.18 కోట్లతో చేపట్టే హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వర్ని నుంచి గుడిబండ వరకు రూ.1.20 కోట్లతో చేపట్టే ఐదు కిలో మీటర్ల బీటీ రోడ్డు పనులను ప్రారంభిస్తారు. భూత్పూర్‌ మునిసిపాలిటీలో రూ.3.50 కోట్లతో నిర్మించే మినీ స్టేడియానికి, రూ.2 కోట్లతో నిర్మించే వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు, రూ.12 కోట్లతో మునిసిపాలిటీ పరిధిలోని తండాలకు నిర్మించే బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అమిస్తాపూర్‌లో ప్రగతి సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.


కోస్గిలో బస్‌ డిపో ప్రారంభం

కోస్గి: కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి పట్టణంలో పలు అభి వృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం మంత్రి కేటీఆర్‌ శనివారం కోస్గికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పట్టణంలో బస్టాండు, బస్‌ డిపో, కూరగా యల మార్కెట్లు, శ్మశానవాటిక, పంచతంత్ర పార్కు, మునిసిపల్‌ కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని కేటీఆర్‌ ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించనున్న గ్రంథాల య భవనానికి శంకుస్థాపన చేస్తారు. కేటీఆర్‌తో పాటు మం త్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహిం చనున్నారు. కేటీఆర్‌ కొడంగల్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసు కున్న తర్వాత మొదటిసారి పర్యటిస్తుండడంతో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దాంతో టీఆర్‌ఎస్‌ నాయ కులు మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

Updated Date - 2022-06-04T04:38:23+05:30 IST