ఎంఈవోలకు మంత్రి హరీశ్‌రావు సన్మానం

ABN , First Publish Date - 2022-07-02T05:01:53+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో దౌల్తాబాద్‌ మండలంలోని అన్ని పాఠశాల్లో ఉత్తమ ఫలితాల సాధించేందుకు కృషిచేసిన మండల విద్యాధికారి నర్సవ్వను సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ సన్మానించారు.

ఎంఈవోలకు మంత్రి హరీశ్‌రావు సన్మానం
దౌల్తాబాద్‌ ఎంఈవోను సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు

దౌల్తాబాద్‌, జూలై 1: పదో తరగతి ఫలితాల్లో దౌల్తాబాద్‌ మండలంలోని అన్ని పాఠశాల్లో ఉత్తమ ఫలితాల సాధించేందుకు కృషిచేసిన మండల విద్యాధికారి నర్సవ్వను సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ సన్మానించారు. ఎంఈవో నర్సవ్వ మాట్లాడుతూ సన్మానం చేయడం మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. 

కొండపాక: పదో తరగతి పరీక్షల్లో కొండపాక మండలం అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో ఎంఈవో శ్రీనివా్‌సరెడ్డిని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సత్కరించారు. 

మంత్రి, డీఈవోను సత్కరించిన పీఆర్టీయూ నాయకులు

సిద్దిపేట క్రైం, జూలై 1: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట నంబర్‌ వన్‌గా నిలిచిన సందర్భంగా పీఆర్టీయూ సిద్దిపేట జిల్లాశాఖ తరఫున అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధర్‌శర్మ, గౌరవాధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజం శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావును కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ పాల్గొన్నారు. 

శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట కల్చరల్‌, జూలై 1: సిద్దిపేటలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 68 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పూల బొకేలను అందించారు. ఈ సందర్భంగా డీఈవో రవికాంతారావు, మండల విద్యాధికారి యాదవరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి  మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో కూడా విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్రస్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల రీజినల్‌ ఇన్‌చార్జి రాజు, కోఆర్డినేటర్‌ కృష్ణారావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ సునయన, అజాల్‌అలీ తదితులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన చైతన్య యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు

కొండపాక, జూలై 1: కొండపాక మండలం దుద్దెడ చైతన్యయూత్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును శుక్రవారం సిద్దిపేట క్యాంపు ఆఫీసులో కలిశారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేయించిన వైకుంఠధామాన్ని గ్రామపంచాయతీకి బహుకరించడం కోసం రావాలని ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో చైతన్య యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2022-07-02T05:01:53+05:30 IST