పయ్యావుల ఆరోపణలపై మంత్రి బుగ్గన కౌంటర్‌

ABN , First Publish Date - 2021-07-13T17:03:07+05:30 IST

ఏపీ ఆర్థిక శాఖలో లెక్కలపై టీడీపీ నేత పయ్యావుల కేశ్‌ వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు.

పయ్యావుల ఆరోపణలపై మంత్రి బుగ్గన కౌంటర్‌

అమరావతి: ఏపీ ఆర్థిక శాఖలో లెక్కలపై పీఏసీ ఛైర్మన్  పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయని స్పష్టం చేశారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎఫ్‌ఎంను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని తెలిపారు. ఆడిట్‌ సంస్థ ప్రశ్నల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏమైనా సందేహాలుంటే మీటింగ్ పెట్టి క్లారిటీ తీసుకోవచ్చు అంటూ మంత్రి బుగ్గన సలహా ఇచ్చారు.


టీడీపీ ఏమన్నది..!?

కాగా.. రాష్ట్ర ఆర్థికశాఖ అస్తవ్యస్థ విధానాలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ.41,043 కోట్లకు సంబంధించి ఖర్చుల వివరాలు లేవంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులకు సంబంధించి ఎలాంటి గోల్‌మాల్‌ జరగలేదని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌ ఖాతా నుంచి వివిధ కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేసినట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వివరణ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి స్పందించి క్లారిటీ ఇవ్వగా తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పై విధంగా మంత్రి బుగ్గన కౌంటరిచ్చారు.



Updated Date - 2021-07-13T17:03:07+05:30 IST