ఆ జిల్లాపై పక్షపాతం లేదు

ABN , First Publish Date - 2022-04-22T14:07:10+05:30 IST

చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు అధికంగా ఉన్న కోయంబత్తూర్‌ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం పక్షపాతం చూపడం లేదని ప్రజాపనులు, రహదారుల శాఖ మంత్రి ఏవీ వేలు స్పష్టం చేశారు.

ఆ జిల్లాపై పక్షపాతం లేదు

                                - మంత్రి ఏవీ వేలు


పెరంబూర్‌(చెన్నై): చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు అధికంగా ఉన్న కోయంబత్తూర్‌ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం పక్షపాతం చూపడం లేదని ప్రజాపనులు, రహదారుల శాఖ మంత్రి ఏవీ వేలు స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఈశ్వరన్‌, కోవై జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రసారమతుతున్నాయని, ఇందుకు వివరణ ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి వేలు సమాధానం చెబుతూ, కోవై జిల్లా అభివృద్ధికి అవసరమైన పలు పథకాలు ప్రభుత్వం విజయవంతంగా నెరవేరుస్తోందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తున్నామని బదులిచ్చారు. అలాగే, శ్రీపెరుంబుదూర్‌ ఎమ్మెల్యే సెల్వపెరుందగై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, పూందమల్లి నుంచి శ్రీపెరుంబుదూర్‌ వరకు వాహనాల రద్దీ తగ్గించే విధంగా ఫ్లై ఓవర్‌ నిర్మించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

Updated Date - 2022-04-22T14:07:10+05:30 IST