Abn logo
May 17 2021 @ 00:49AM

రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు నల్లబజారులో విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించండి

ఏలూరు రూరల్‌, మే 16: కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమిడెసి విర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మా ర్కెట్‌లో  అమ్ముతున్న వ్య క్తుల పట్ల కఠినంగా వ్యవ హరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తులను ఎట్టి పరిస్థితిల్లో ఉపేక్షించ వద్దని, అన్ని ఆస్పత్రుల్లో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల భద్రతలో సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్‌ అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నాని సూచించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో ఆదివారం సాయంత్రం నాని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిశారు. జిల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ అమలు, ఆక్సిజన్‌, బెడ్స్‌, వెంటిలేటర్స్‌ కొత్తగా వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు తీసుకోవలసిన చర్యలపై నాని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో చర్చించారు. కరోనాతో హాస్పిటల్స్‌కి వస్తున్న బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని ఆసుపత్రిలో హెల్ప్‌డెస్క్‌ కరోనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని లేకుండా 104 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని నాని చెప్పారు. 


Advertisement