మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-05T06:28:36+05:30 IST

పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వీఆర్వోల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌, గోపికృష్ణ డిమాండ్‌ చేశారు.

మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
నాగాయలంకలో వినతిపత్రం అందజేత

వీఆర్వోల నిరసన

చల్లపల్లి, డిసెంబరు 4 : పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వీఆర్వోల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌, గోపికృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శనివారం సచివాలయాలకు వెళ్లకుండా తహసీల్దార్‌ కార్యాలయం వద్దే నల్లబ్యాడ్జీలు ధరించి విధులను నిర్వహించారు. పగలు, రాత్రి సంబంధం లేకుం డా, సెలవు రోజుల్లో సైతం కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్న వీఆర్వోలపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయ టం అమానుషమన్నారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షులు తూము వెంకటేశ్వరరావు, బందరు డివిజన్‌ అధ్యక్షుడు  ఘంటసాల కృష్ణమోహన్‌, వీఆర్వోలు చల్లపల్లి శ్రీనివాసు, రాజేంద్ర, నాగమణి, ప్రసాద్‌, శ్రీను, జయరాం పాల్గొన్నారు. 

నాగాయలంక : వీఆర్వోలు సచివాలయాలకొస్తే తరిమి కొట్టాలన్న మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మండల వీఆర్వోల సంఘం డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం వీఆర్వోలు ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్‌ అబ్దుల్‌ రఫీకి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత టి.జి.ఎ్‌స.సాయిబాబు మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి క్షమాపణ చెప్పేంతవరకు సచివాలయంలోని విధులను బహిష్కరిస్తామన్నారు. వీఆర్వోలు కె.బి.రాజేంద్ర ప్రసాద్‌, సనకా జనార్థనరావు, పెండ్యాల చంద్రమోహన్‌, కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు తదితరులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-12-05T06:28:36+05:30 IST