ఉచిత పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే కఠినచర్యలు

ABN , First Publish Date - 2022-06-23T15:47:08+05:30 IST

ఉచిత పాఠ్యపుస్తకాలు విక్రయించే పాఠశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ హెచ్చరించారు. మదురై జిల్లా

ఉచిత పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే కఠినచర్యలు

                             - హెచ్చరించిన విద్యాశాఖ మంత్రి 


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 22: ఉచిత పాఠ్యపుస్తకాలు విక్రయించే పాఠశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ హెచ్చరించారు. మదురై జిల్లా నాగమలైపుదుకోటలో జరిగిన విద్యాశాఖ అధికారుల నైపుణ్య శిక్షణా తరగతులను బుధవారం మంత్రి మహేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అధికారులకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్‌, ప్లస్‌ టూ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు అధైర్య పడకుండా తదుపరి తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా కృషిచేయాలన్నారు. తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని ఉత్తర్వులిచ్చామని, ఈ పుస్తకాలతో పాటు పది రకాల విద్యా ఉపకరణాలు అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలుచేయరాదని, అలాగే, ఉచిత పాఠ్యపుస్తకాలు విక్రయించే పాఠశాలలపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల నైపుణాభివృద్ధి పెంచేలా ముఖ్యమంత్రి ఉత్తర్వులతో పలు చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ విద్యావిధానం కన్నా రాష్ట్రంలో మెరుగైన విద్యనందించేలా కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-23T15:47:08+05:30 IST