మళ్లీ తెరపైకి మైనింగ్‌ జోన్‌

ABN , First Publish Date - 2021-04-13T05:20:23+05:30 IST

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం

మళ్లీ తెరపైకి మైనింగ్‌ జోన్‌
మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం (ఫైల్‌)

  • ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు


యాచారం : యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండల కేం ద్రంలోని సర్వే నెంబర్‌ 105, 121, 126, 132, 200లలో మొత్తం 618ఎకరాల 16గుంటల భూమిలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రాయి, మెటల్‌క్వారీ కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతి ఉందని రాష్ట్ర మైనింగ్‌జోన్‌ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్వే నెంబర్‌ 142, 44, 146, 149, 151లలో 140 ఎకరాల్లో క్వారీలు ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మైనింగ్‌జోన్‌ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. 2024 ఫిబ్రవరి 4వ తేదీ వరకు క్వారీ లీజు కొనసాగించడానికి అనుమతి ఉందని  ప్రభుత్వం పేర్కొంది. 121 సర్వే నెంబర్‌లోని 39 ఎకరాలను మైనింగ్‌జోన్‌ కింద క్వారీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. 



Updated Date - 2021-04-13T05:20:23+05:30 IST