అక్రమంగా రాళ్లను తరలిస్తున్న డంపర్‌ను అడ్డుకున్న డీఎస్పీ.. ఇంతలో ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2022-07-20T17:50:22+05:30 IST

హర్యానాలోని తావ్డూ (నుహ్) డీఎస్పీ సురేంద్ర సింగ్...

అక్రమంగా రాళ్లను తరలిస్తున్న డంపర్‌ను అడ్డుకున్న డీఎస్పీ.. ఇంతలో ఊహించని విధంగా..

హర్యానాలోని తావ్డూ (నుహ్) డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ మైనింగ్ మాఫియా చేతిలో హతమయ్యారు. పక్కా సమాచారంతో ఈ డీఎస్పీ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న తౌరుకొండ ప్రాంతంలో దాడులు చేసేందుకు వెళ్లారు. మరో మూడు నెలలలో డీఎస్పీ సురేంద్ర సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. డీఎస్పీ సురేంద్ర సింగ్ పచ్‌గావ్ కొండ సమీపంలో అక్రమంగా అక్రమంగా రాళ్లను తరలిస్తున్న డంపర్‌ను ఆపాలంటూ సైగ చేశారు. 


దీనిని గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగాన్ని పెంచి పోలీసు అధికారిపై దాడిచేస్తూ ముందుకు వెళ్లాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే నిందితుడు పరారయ్యాడు. డంపర్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం మైనింగ్ మాఫియాకు అండగా నిలుస్తున్నదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రభుత్వానికి, మైనింగ్ మాఫియాకు మధ్య ఉన్న అనుబంధం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-20T17:50:22+05:30 IST