‘మేధోశక్తి తగ్గిపోతోంది’

ABN , First Publish Date - 2021-03-04T06:36:32+05:30 IST

నులిపురుగులతో చిన్నారుల్లో రక్త హీనత ఏర్పడి మేధోశక్తి తగ్గిపోతోందని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన్న అన్నారు.

‘మేధోశక్తి తగ్గిపోతోంది’
మాట్లాడుతున్న హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన్న

నంద్యాల (ఎడ్యుకేషన్‌), మార్చి 3: నులిపురుగులతో చిన్నారుల్లో రక్త హీనత ఏర్పడి మేధోశక్తి తగ్గిపోతోందని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన్న అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు నులిపురుగుల ఆవశ్యకతపై పామన్న అవగాహన కల్పించారు. పోస్టర్లను వైద్య సిబ్బంది, విద్యార్థినులు విడుదల చేశారు. నులిపురుగుల నివారణ కోసం ఆల్‌బెండాజోల్‌ మాత్రలను ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు భోజన అనంతరం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫర్హాన్‌బేగం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T06:36:32+05:30 IST