మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-05-20T05:32:36+05:30 IST

రైస్‌ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, 100 గ్రాముల ధాన్యం అధికంగా తూకం వేసినా రైస్‌ మిల్లర్ల లైసన్స్‌ రద్దు చేస్తామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్‌ ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రబాకర్‌గౌడ్‌ ఆన్నారు.

మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు
చిన్నముల్కనూర్‌లో రైతులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

 అధికంగా తూకం వేస్తే రైస్‌ మిల్లర్ల లైసెన్స్‌ రద్దు చేస్తామన్న మంత్రి కనిపించడం లేదు

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం

 మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌


చిగురుమామిడి, మే 19: రైస్‌ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, 100 గ్రాముల ధాన్యం అధికంగా తూకం వేసినా రైస్‌ మిల్లర్ల లైసన్స్‌ రద్దు చేస్తామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్‌ ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రబాకర్‌గౌడ్‌ ఆన్నారు. గురువారం మండ లంలోని  చిన్నముల్కనూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే మిల్లర్లు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూపిస్తా మన్నారు. రైతులను దోపిడీ చెయ్యడం ఆపకపోతే 21, 22 తేదీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందోళనలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు గత్యం తరం లేక ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. ట్రాక్టరు లోడ్‌కు మూడు సంచులు కట్‌ చేస్తూ మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకుంటున్నారని, అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ము ఖ్యమంత్రి దత్తత గ్రామంలోనే రైతులు ఈ విధంగా దోపిడీకి గురవుతుం టే మిగితా గ్రామాల స్థితి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ హుస్నాబాద్‌ నియెజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, నాయకులు చిట్టుమల్ల రవీందర్‌, రాములు, బాబు, లక్ష్మి, అనిల్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:32:36+05:30 IST