Shocking: వేప చెట్టు నుంచి బయటకు వస్తున్న పాలు.. పూజలు చేస్తున్న గ్రామస్తులు.. అసలు విషయం బయటపెట్టిన ప్రొఫెసర్

ABN , First Publish Date - 2022-08-17T02:34:13+05:30 IST

చెట్టు నుంచి పాలు కారడం, వినాయకుడి విగ్రహం పాలు తాగడం వంటి కొన్ని నమ్మశక్యం గాని విషయాల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి.

Shocking: వేప చెట్టు నుంచి బయటకు వస్తున్న పాలు.. పూజలు చేస్తున్న గ్రామస్తులు.. అసలు విషయం బయటపెట్టిన ప్రొఫెసర్

చెట్టు నుంచి పాలు కారడం, వినాయకుడి విగ్రహం పాలు తాగడం వంటి కొన్ని నమ్మశక్యం గాని విషయాల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని జుంజును జిల్లాలోని పిలానీ గ్రామంలో ఒక వేప చెట్టు నుంచి పాలు కారడం ప్రారంభించాయి. దానిని గమనించిన గ్రామస్తులు ఆ చెట్టు చుట్టూ చేరి భజనలు, కీర్తనలు ప్రారంభించారు. దీపాలు వెలిగించి పూజలు మొదలుపెట్టారు. 15 రోజులుగా వేప చెట్టు నుంచి పాల లాంటి పదార్థం వేగంగా బయటకు వస్తోంది. 


ఇది కూడా చదవండి..

China: తనను కౌగిలించుకున్న సహోద్యోగిపై కేసు పెట్టిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!


వేప చెట్ట నుంచి పాలు రావడం దైవ మహిమే అంటూ చుట్టు పక్కల గ్రామాల వాళ్లు ఆ చెట్టు దగ్గరకు తండోపతండాలుగా వెళుతున్నారు. వృక్షశాస్త్ర నిపుణుడు డాక్టర్ స్మితాంజలి మిశ్రా అసలు విషయం బయటపెట్టారు. ఇది అద్భుతం లేదా దైవానుగ్రహం కాదని మిశ్రా చెప్పారు. ఆ చెట్టు ఆగ్రోబాక్టీరియం ట్యూమెఫేసియన్స్ అనే ఇన్ఫెక్షన్‌కు గురైందని చెప్పారు. ఒక మొక్క లేదా చెట్టులోకి ఆ రకమైన బ్యాక్టీరియా ప్రవేశించినపుడు చెట్టు తనంతట తానే చికిత్స చేసుకుంటుందని, తేమ తక్కువగా ఉన్నప్పుడు, ఈ రకమైన ద్రవం స్వయంచాలకంగా బయటకు వస్తుందని చెప్పారు. 


అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక చెట్టు లేదా మొక్క వ్యాధితో బాధపడుతుంటే, దాని నుండి ఈ రకమైన ద్రవం బయటకు వస్తుందని, వృక్షాలు ఈ ప్రక్రియ ద్వారా స్వయంగా చికిత్స చేసుకుంటాయని మిశ్రా చెప్పారు. కాగా, ఆ మొక్క నుంచి వస్తున్న పాలను చాలా మంది గ్లాస్‌ల్లో పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారని, అందులో ఉండే బ్యాక్టీరియా చాలా హానికరమని మిశ్రా హెచ్చరించారు.  

Updated Date - 2022-08-17T02:34:13+05:30 IST