భక్తిప్రపత్తులతో మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , First Publish Date - 2021-10-20T05:21:57+05:30 IST

మహ్మద్‌ ప్రవక్త(సల్లా)జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ముస్లిం సోదరులు మిలాద్‌ ఉన్‌నబీని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. దైవాంశ సంభూతుడిగా దిగివచ్చిన మహ్మద్‌ ప్రవక్త భక్తులను ఉద్దరించడానికి ఈ రోజు జన్మించాడని భక్తులు విశ్వసిస్తారు.

భక్తిప్రపత్తులతో మిలాద్‌ ఉన్‌ నబీ
నగరంలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం, ప్రవచిస్తున్న ముస్లిం మతపెద్ద

వక్తల ప్రసంగాలతో మార్మోగిన వీధులు

ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తిన జిల్లా

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 19: మహ్మద్‌ ప్రవక్త(సల్లా)జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ముస్లిం సోదరులు మిలాద్‌ ఉన్‌నబీని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. దైవాంశ సంభూతుడిగా దిగివచ్చిన మహ్మద్‌ ప్రవక్త భక్తులను ఉద్దరించడానికి ఈ రోజు జన్మించాడని భక్తులు విశ్వసిస్తారు. దీంతో మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి దైవనామస్మరణలోనే ము స్లింలు గడిపారు. ఉదయం నుంచే వీధులన్నీ అల్లా, మహ్మద్‌ ప్రవక్త నామస్మరణతో మార్మోగాయి. ఊరేగి ంపులో ఆకుపచ్చ జెండాలు స్వాగత తోరణాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని హాశ్మీకాలనీ నుంచి మాలపల్లి, అహ్మద్‌పుర, బర్కత్‌పుర, ఖిల్లారోడ్డు, ఆజాంరోడ్డు, బ డాబజార్‌ మీదుగా నెహ్రూపార్క్‌ వరకు మర్కజే మి లాద్‌కమిటీ ఆధ్వర్యంలో జులుసే మహ్మదీయ ర్యాలీని నిర్వహించారు. ముస్లింలు నిర్వహించిన ర్యాలీతో ఇం దూరు అల్లా స్మరణతో మారుమోగిపోయింది. ఉద యం నుంచే యువకులు, పెద్దలు, చిన్నారులు పెద్ద ఎత్తున బైకులపై, ఓపెన్‌టాప్‌ జీపులపై అల్లాను స్మరి స్తూ ఊరేగింపు జరిపారు. అనంతరం నెహ్రూ పార్క్‌ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాని కి ముఖ్యఅథితిగా హాజరైన వక్తలు మహ్మద్‌ ప్రవక్త ముస్లింలకు సూచించిన విధివిధానాలను తెలిపారు. ప్రపంచంలో ప్రవక్త ద్వారానే ఖురాన్‌ వచ్చిందన్నారు. ఖురాన్‌ పఠనం ద్వారా అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని పవిత్ర ఆ లోచనలతో మెలగాలని ఆయన బోధించారు. ముస్లిం మతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, అటువంటి వా రిని ఇస్లాం మతం వ్యతిరేకిస్తుందని వక్తలు పేర్కొన్నా రు. ఉగ్రవాదంతో సంబంధాలున్న వారిని కఠినంగా శి క్షిస్తాడని అభిప్రాయవ్యక్తం చేశారు. ప్రపంచశాంతి కో సం అందరూ కృషి చేయాలని సూచించారు. ముస్లిం లు ప్రపంచ శాంతికోసం అనేకసార్లు ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీ వితాన్ని సార్థకం చేసుకోడానికి మంచి పనులనే ఆచరి ంచాలని మత పెద్దలు సూచించారు. ప్రతీ మనిషికి జీవిత లక్ష్యం ఉంటుందని, ఆ లక్ష్యాన్ని చేరడానికి దైవమార్గంలో నడిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ప్ర పంచ శాంతి కోసం మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గం లో నడుస్తూ ముస్లింల ఐక్యతను చాటిచెప్పాలని పి లుపునిచ్చారు. మిలాద్‌ ఉన్‌ నబిని పురస్కరించుకుని ముస్లింలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీ య నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల మిలాద్‌ ఉన్‌ నబి ర్యాలీలో రాజకీయ నాయకులు పా ల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని బోధన్‌, బాన్సువా డ, మోస్రా, వర్ని, మోర్తాడ్‌, సారంగపూర్‌, కామారెడ్డి, మాచారెడ్డి, డిచ్‌పల్లి, ధర్మారం, జాన్కంపేట్‌, ఫకిరాబా ద్‌, ఆర్మూర్‌, నవీపేట్‌, నందిపేట్‌, మాక్లూర్‌, పోచంపా డ్‌ తదితర ప్రాంతాల్లో ఉదయంనుంచే ర్యాలీలు మతపెద్దల ప్రవచనాలతో శోభాయమానంగా మారాయి. 

Updated Date - 2021-10-20T05:21:57+05:30 IST