ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , First Publish Date - 2020-10-31T07:44:17+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటలో పండుగను

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

నారాయణపేట/నారాయణపేట క్రైం/ దామరగిద్ద/ ధన్వాడ/ మద్దూ ర్‌/ ఊట్కూర్‌, అక్టోబరు 30 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటలో పండుగను పురస్కరించుకొని బువ్వమ్మ గుట్ట దర్గా నుంచి ప్రధాన రోడ్డు గుండా పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి చౌక్‌ బజార్‌లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కుంభం శివ కుమార్‌ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ నేత జలీల్‌ బేగ్‌ ఆధ్వర్యంలో పండ్ల రసాలను పంపిణీ చేశారు. పలువురు పండ్లు, వాటర్‌ పాకెట్లను అందించారు. ర్యాలీని సీఐ శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్‌ఐ చంద్ర మోహన్‌లు పర్యవేక్షించారు. ర్యాలీలో మైనార్టీ నేతలు అమీరుద్దీన్‌, అబ్దుల్‌ సలీం, సర్ఫరాజ్‌, తఖీ చాంద్‌, జలీల్‌, చాంద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు యూసుఫ్‌ తాజ్‌ శుక్రవారం బ్రెడ్లు, వాటిర్‌ బాటిళ్లు, పండ్లు పంపిణీ చేశారు. పండుగ సందర్భం గా జిల్లా కేంద్రంలో బందోబస్తును ఎస్పీ డా.చేతన పర్యవేక్షించారు.


స్పెషల్‌పార్టీ బలగాలతో, సివిల్‌ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశా రు. బందోబస్తులో డీఎస్పీ మఽధుసూదన్‌రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, ఇఫ్తెకార్‌ అహ్మద్‌, ఎస్‌ఐలు చంద్రమోహన్‌, రాంబా బు, మధుసూదన్‌, నవీద్‌, నాసర్‌ ఉన్నారు. దామర గిద్ద, కాన్‌కుర్తి, లోకుర్తి, క్యాతన్‌పల్లి, మొగుల్‌మడ్క తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ధన్వాడ మండలంలో ముస్లిం లు మస్జిద్‌లో ప్రార్థనలు చేసి, మహ్మద్‌ ప్రవక్త ప్రవచనాలను వివరించారు. మద్దూర్‌, రెని వట్ల, భూనీడ్‌ గోకుల్‌నగర్‌, దంగాన్‌పూర్‌, నంది పాడ్‌, ఖాజీపూర్‌, దోరేపల్లి స్థానిక మస్జిద్‌ లలో జాగారం చేశారు. ఆయా మస్జిద్‌ల ఇమాంలు, కమిటీ సభ్యులు షేక్‌అహ్మద్‌, చాంద్‌పాషా, సయ్యద్‌ మూస, పీర్‌ అ హ్మద్‌, రుక్మొద్దీన్‌, గులాం రసూల్‌ మహి మూద్‌, మైనుద్దీన్‌, ఖదీర్‌ పాల్గొన్నారు. ఊట్కూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో చిన్నపొర్ల జామియా మస్జిద్‌ కమి టీఅధ్యక్షుడు జె ఇస్మాయిల్‌, ఉపాధ్యక్షుడు దయ్యల్‌ ఖాసీం, మత గురువులు హఫీస్‌ ఖుర్షీద్‌, సూఫీయాన్‌, ఇమామ్‌ మహిబూబ్‌ అలీ, మత పెద్దలు, చాంద్‌పాషా, యూసుఫొ ద్దీన్‌, నన్నేసాబ్‌, ఆడెం మన్సూర్‌, ఆడెం ఫయాజ్‌, రహిమత్‌, వై. పాషా, వై. అజ్మత్‌, జె ఎక్బాల్‌పాషా, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:44:17+05:30 IST