ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో వ‌ల‌స కూలీల బ‌స‌... ఎండిన రొట్టెలే ఆహారం!

ABN , First Publish Date - 2020-05-27T12:57:32+05:30 IST

ఒక వైపు క‌రోనా మహమ్మారి, మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మ‌కులు అనేక అవ‌స్థ‌ల‌కు లోన‌వుతున్నారు. మండే ఎండ‌ల్లో చురుక్కుమ‌నే...

ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో వ‌ల‌స కూలీల బ‌స‌... ఎండిన రొట్టెలే ఆహారం!

ఒక వైపు క‌రోనా మహమ్మారి, మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మ‌కులు అనేక అవ‌స్థ‌ల‌కు లోన‌వుతున్నారు. మండే ఎండ‌ల్లో చురుక్కుమ‌నే రోడ్ల‌పై న‌డుస్తుండ‌టంతో వారి పాదాలకు బొబ్బలెక్కిపోతున్నాయి. మ‌రోవైపు రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఇంతేకాదు ఏదో ఒక లారీ ఎక్కి ప్ర‌మాదాల‌కు గురై ప్రాణాలు కోల్పోతున్న‌వారు కూడా ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో వ‌ల‌స కార్మికుల బ‌స‌కు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. కోట నాకా అని పిలిచే  ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని శివపురి సరిహద్దును, రాజస్థాన్‌లోని బాన్రా జిల్లాను కలుపుతుంది. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లలో వలస కూలీలకు వసతి సౌక‌ర్యం కల్పించారు. దీంతో మ‌రోమార్గం లేక  ఇక్క‌డే ఉంటున్నారు. ప్రభుత్వం పంపించే ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే ఆ ఆహారం చెడిపోతున్న‌ద‌ని, ఎండిన రొట్టెలు పంపిస్తున్నార‌ని వారు త‌ర‌చూ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తున్నా ఫ‌లితం లేక‌పోతోంది. 


Updated Date - 2020-05-27T12:57:32+05:30 IST