లాక్‌డౌన్ భయంతో సొంతూళ్ళకు వెళ్లిపోతున్న కూలీలు

ABN , First Publish Date - 2022-01-09T22:49:52+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతుండటంతో వలస

లాక్‌డౌన్ భయంతో సొంతూళ్ళకు వెళ్లిపోతున్న కూలీలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతుండటంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వారాంతపు కర్ఫ్యూలు నెమ్మదిగా అష్టదిగ్బంధనానికి దారి తీసే అవకాశం ఉందనే భయంతో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. గతంలో అష్టదిగ్బంధనం అమలైన సమయంలో తాము ఎదుర్కొన్న కష్టాలను, ఆహారం, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటివాటికి ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. 


ఓ వలస కూలీ మాట్లాడుతూ, గతంలో అష్టదిగ్బంధనం విదించినపుడు తాను, తన కుటుంబం ఢిల్లీలో చిక్కుకున్నట్లు తెలిపారు. తాను చాలా కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పారు. అందుకే ఈసారి కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలుసుకున్న వెంటనే తన సొంతూరికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కర్ఫ్యూను పొడిగించకపోతే తాము మళ్ళీ ఢిల్లీకి వస్తామన్నారు. 


మరో కూలీ మాట్లాడుతూ, గతంలో లాక్‌డౌన్ విధించినపుడు తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన పిల్లలతో సహా తన కుటుంబం ఓ రోజంతా పస్తు ఉన్నట్లు తెలిపారు. తన స్నేహితుని వద్ద అప్పు చేసి, స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈసారి అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో తన స్వస్థలానికి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు రాత్రి సమయంలోనూ, వారాంతంలోనూ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మాట్లాడుతూ, దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 ప్రభంజనం వ్యాపిస్తున్నప్పటికీ  అష్ట దిగ్బంధనం (లాక్‌డౌన్)ను విధించే యోచన లేదని చెప్పారు. గడచిన 24 గంటల్లో దాదాపు 22,000 కేసులు నమోదైనట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-09T22:49:52+05:30 IST