స్వస్థలాలకు వలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-24T09:44:34+05:30 IST

వలస కూలీలను శ్రామిక రైళ్లలో స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం సాయంత్రం, ఆదివారం తెల్లవారుజామున ఏడు రైళ్లలో

స్వస్థలాలకు వలస కూలీలు

ఘట్‌కేసర్‌: వలస కూలీలను శ్రామిక రైళ్లలో స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం సాయంత్రం, ఆదివారం తెల్లవారుజామున ఏడు రైళ్లలో దాదాపు 10వేలు మందిని స్వరాష్ట్రాలకు తరలించారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీ్‌సఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు ఏడు శ్రామిక్‌ రైళ్లల్లో కూలీలను తరలించారు. మధ్యాహ్నం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలను ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు తరలించారు.


మూడు గంటల నుంచే ఘట్‌కేసర్‌ పోలీసులు దుకాణాలను మూయించి, ప్రత్యేక గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లోని ప్రధాన రోడ్డులో ధర్మశాల నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు ఆర్టీసీ బస్సులను నిలిపి ఉంచారు. కూలీలకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, రైళ్లలోకి అనుమతించారు. కూలీలకు వైఎ్‌సఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2020-05-24T09:44:34+05:30 IST