Mexican navy: హెలికాప్టర్ కూలి ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-26T18:20:24+05:30 IST

మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు....

Mexican navy: హెలికాప్టర్ కూలి ముగ్గురికి గాయాలు

అగువా బ్లాంకా (మెక్సికన్): మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు మి-17 మెక్సికన్ నౌకాదళ హెలికాప్టర్ వెళుతుండగా పైలెట్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఈ హెలికాప్టర్ హిడాల్గో రాష్ట్రంలోని అగువా బ్లాంకా పట్టణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని అంబులెన్సు ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వెరాక్రూజ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎరిక్ సిస్నెరోస్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్ సైట్ ప్రాంతంలో కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 


Updated Date - 2021-08-26T18:20:24+05:30 IST