బీజేపీకి మెట్రో శ్రీధరన్ ఝలక్

ABN , First Publish Date - 2021-12-16T23:45:36+05:30 IST

బీజేపీ నేత, ‘మెట్రో’ శ్రీధరన్ రాజకీయాల

బీజేపీకి మెట్రో శ్రీధరన్ ఝలక్

తిరువనంతపురం : బీజేపీ నేత ‘మెట్రో’ శ్రీధరన్ రాజకీయాల నుంచి వైదొలగారు. ఆయన స్వస్థలం మలప్పురంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తన వయసు తొంభయ్యేళ్ళని చాలా మందికి తెలియదన్నారు. తన వయసుకు సంబంధించి తాను అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నానని చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తాను చెప్పానంటే, దాని అర్థం రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు కాదన్నారు. 


తాను ఎన్నికల్లో ఓడిపోయినపుడు బాధపడ్డానని చెప్పారు. కానీ ఇప్పుడు తాను బాధపడటం లేదన్నారు, దీనికి కారణాన్ని వివరిస్తూ, ఒక ఎమ్మెల్యేతో ఏమీ జరగదన్నారు. కేరళలో బీజేపీకి 16 నుంచి 17 శాతం ఓట్ షేర్ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు అది తగ్గిపోయిందని చెప్పారు. తాను ఎన్నడూ రాజకీయవేత్తను కానని, తాను బ్యూరోక్రాట్‌నని, తాను రాజకీయాల్లో క్రియాశీలంగా లేనప్పటికీ, ఇతర మార్గాల్లో తాను ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందిస్తానని తెలిపారు. తనకు మూడు ట్రస్టులు ఉన్నాయని తెలిపారు. 


కేరళ శాసన సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. ఆయనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-12-16T23:45:36+05:30 IST