నేటి నుంచి ఆ ఆరు బ్యాంకులు కనిపించవ్..

ABN , First Publish Date - 2020-04-01T17:31:03+05:30 IST

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లోకి విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. ..

నేటి నుంచి ఆ ఆరు బ్యాంకులు కనిపించవ్..

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు నాలుగూ... చిన్న బ్యాంకులను తమలోకి విలీనం చేసుకున్నాయి. దీంతో ఈ పది బ్యాంకులు నేటి నుంచి నాలుగు బ్యాంకులుగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.


ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కాగా.. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులోనూ కలిసిపోయాయి. ఇక ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే పురాతన బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి చరిత్ర పుటల్లోకి వెళ్లిపోనుంది. కరోనా కల్లోలం కారణంగా బ్యాంకుల విలీనం నిలిచిపోతుందని అందరూ భావించినా... ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 1న విలీనం జరిగిపోయింది. విలీనమైన బ్యాంకు వినియోగదారులంతా ఆటోమేటిక్‌గా విలీనం చేసుకున్న బ్యాంకుల్లో సేవలు పొందొచ్చు. కాగా గతేడాది దేనా బ్యాంకు, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-01T17:31:03+05:30 IST