1955 సంవత్సరానికి చెందిన ఈ కారు ధర రూ.1100కోట్లు!

ABN , First Publish Date - 2022-05-20T20:12:42+05:30 IST

మెర్సెడెస్ బెంజ్ కారు రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా గుర్తుంపు పొందింది. ఇపుడు దీనికి సంబంధించిన వార్త ప్ర

1955 సంవత్సరానికి చెందిన ఈ కారు ధర రూ.1100కోట్లు!

ఇంటర్నెట్ డెస్క్: మెర్సెడెస్ బెంజ్ కారు రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా గుర్తుంపు పొందింది. ఇపుడు దీనికి సంబంధించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుండగా.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ కారు ఏ సంస్థకు చెందింది. ఎంతకు అమ్ముడు పోయింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



1955కు చెందిన మెర్సెడెస్ బెంజ్ (Mercedes-Benz) కారు మే 5న జర్మనీలో జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మెర్సెడెస్ బెంజ్ 300ఎస్‌ఎల్‌ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే ( Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupé) అని పిలిచే ఈ కారును ఓ వ్యక్తి ఏకంగా 143 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1109కోట్లు) పెట్టి కొనుగోలు చేశాడు. వేలాన్ని నిర్వహించిన కెనడా కంపెనీ ఆర్ఎం సూత్బే (RM Sotheby)నే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని మాత్రం ఈ సంస్థ బయటపెట్టలేదు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. RM Sotheby 2018లో నిర్వహించిన వేలంలో 1962కు చెందిన ఫెరారీ 250 జీటీఓ 48.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. 


Updated Date - 2022-05-20T20:12:42+05:30 IST