Viral Video: రెస్టారెంట్‌లో తింటున్న ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన.. ఆమె అడ్డుకోవడంతో అతడు రెచ్చిపోయి..

ABN , First Publish Date - 2022-06-14T19:52:17+05:30 IST

ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది.. అక్కడ భోజనం చేస్తుండగా ఒక వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు..

Viral Video: రెస్టారెంట్‌లో తింటున్న ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన.. ఆమె అడ్డుకోవడంతో అతడు రెచ్చిపోయి..

ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది.. అక్కడ భోజనం చేస్తుండగా ఒక వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆమెను ముట్టుకున్నాడు.. దీంతో ఆ మహిళ అతడిని అడ్డుకుని పక్కకు నెట్టేసింది.. వెంటనే మరో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వెళ్లి ఆ మహిళపై, ఆమె స్నేహితురాలిపై దాడికి తెగబడ్డారు.. ఈ ఘటన చైనాలోని తాంగ్‌షాన్‌ నగరంలో జరిగింది.. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


 బాధిత మహిళ తాంగ్‌షాన్ నగరంలో తన స్నేహితురాలితో కలిసి గత శుక్రవారం ఓ బార్బిక్యూ రెస్టారెంట్‌కు వెళ్లింది. తన స్నేహితురాలితో కలిసి తింటుండగా ఆమె టేబుల్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె అతడిని నెట్టేసింది. వెంటనే అతడి స్నేహితులు ముగ్గురు అక్కడకు వెళ్లి ఆ మహిళలపై దాడికి తెగబడ్డారు. ఇద్దరినీ రెస్టారెంట్ బయటకు లాక్కొని వెళ్లి కింద పడేసి కొట్టారు. ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి చైనీస్ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.   


Updated Date - 2022-06-14T19:52:17+05:30 IST