మగవారు మాస్కులను ఇష్టపడరట.. తాజా సర్వేలో వెల్లడి

ABN , First Publish Date - 2020-05-17T03:57:47+05:30 IST

కరోనా మహమ్మారి ఇంకా అదపులోకి రాని నేపథ్యంలో మాస్కులు అంశంపై జరిపిన ఓ సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి.

మగవారు మాస్కులను ఇష్టపడరట.. తాజా సర్వేలో వెల్లడి

లండన్: కరోనా మహమ్మారి ఇంకా అదపులోకి రాని నేపథ్యంలో  మాస్కులు అంశంపై జరిపిన ఓ సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మాస్కుల పట్ల ఆడవారి కంటే మగవారే ఎక్కువ అయిష్టత ప్రదర్సిస్తారని చెప్పిన సర్వే.. మాస్కులు లేకుండా బహిరంగా ప్రదేశాల్లో సంచరించే అవకాశం మగవారి విషయంలోనే అధికమని స్పష్టం చేసింది. మాస్కులు అంటే బలహీనతకు చిహ్నమని వారు భావించడమే ఇందుకు కారణమట. లండన్‌లోని  మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ, కాలిఫోర్నియాలోని మాథమెటికల్ సైన్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు అమెరికాలోని పురుషులపై చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడింది.  కరోనా తమను ఏంచేయదని అధిక శాతం మంది పురుషులు భావించడమే కారణమని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇక మాస్కులు పెట్టుకోకపోవడమనేది ప్రాంతాల వారిగా మారుతుందని, మాస్కులు కచ్చితంగా ధరించాలనే నిబంధన లేని చోట్ల అధిక సంఖ్యలో మగవారు మాస్కులకు దూరంగా ఉంటారని సర్వేలో తేలింది. కానీ శాస్త్రపరంగా చూస్తే..  ఆడవారి కంటే మగవారిలోనే కరోనా ప్రతికూలప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. పురుషుల రక్తంలో ఉండే ఎంజైమ్ కారణంగా వైరస్.. మగవాళ్లలో ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-17T03:57:47+05:30 IST