Abn logo
Apr 21 2021 @ 00:34AM

9 మంది సచివాలయ సిబ్బందికి మెమోలు

- విధుల్లో అలసత్వంపై మేయర్‌ ఆగ్రహం 

అనంతపురం కార్పొరేషన, ఏప్రిల్‌ 20: నగరంలోని 1, 5, 7 సచివాలయాల పరిధిలోని తొమ్మిది మంది సిబ్బందికి మంగళవారం అధికారులు మెమోలు జారీ చే శారు. విధుల్లో అలసత్వం వహించడంపై నగరపాలక సంస్థ మేయర్‌ వసీం సలీమ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆయా సచివాలయాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలువురు సిబ్బంది కార్యాలయాల్లో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రిజిష్టర్‌ తనిఖీ చేయగా... అందులో ఎ క్కువ మంది ఫీల్డ్‌కు వెళ్లినట్లు రాయడంపై మేయర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వి ధుల్లో లేని వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. అయితే కార్పొరేషన కార్యాలయంలో మెమోలు జారీ చేయకుండా కొందరు నొక్కిపెట్టడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు మేయర్‌  పట్టుపట్టడంతో మెమోలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకటవ సచివాలయంలోని దాదాపీర్‌, మాధవీలత, సాయిశ్వేత, ఐదో సచివాలయంలోని జనార్దనరాజు, ప్రసాద్‌, తనూజ్‌కుమార్‌, ఏడో సచివాలయంలోని గంగాధర, అపర్ణ, రవళిలకు మెమోలు జారీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement