గురవాంలో కొట్లాట.. 15 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-12T05:00:07+05:30 IST

మండల పరిధిలోని గురవాంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన కొట్లాటలో 15 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెల్లి, కాపు కులస్థుల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. వీరంతా రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గురవాంలో కొట్లాట.. 15 మందికి గాయాలు

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 11: మండల పరిధిలోని గురవాంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన కొట్లాటలో  15 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెల్లి, కాపు కులస్థుల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. వీరంతా రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చందక బాబ్జి రెల్లి కులస్థులైన కె.గోపి తదితర తొమ్మిది మందిపై, అలాగే రెల్లి సామాజిక వర్గానికి చెందిన కె.గోపి ప్రత్యర్థి వర్గానికి చెందిన చందక బాబ్జి తదితర ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులను నమోదు చేసినట్లు ఎస్‌ఐ రేవతి తెలిపారు. కాగా గురవాం గ్రామాన్ని రాజాం సీఐ శ్రీనివాసరావు సందర్శించి తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-04-12T05:00:07+05:30 IST