Yasin Malik ను కిడ్నాపర్‌గా గుర్తించిన మాజీ సీఎం సోదరి

ABN , First Publish Date - 2022-07-16T02:14:47+05:30 IST

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇటీవల జీవిత ఖైదు పడిన జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ మరో కేసులో చిక్కుల్లో ..

Yasin Malik ను కిడ్నాపర్‌గా గుర్తించిన మాజీ సీఎం సోదరి

జమ్మూ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇటీవల జీవిత ఖైదు పడిన జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ (Yasin Malik) మరో కేసులో చిక్కుల్లో పడ్డాడు.1989లో తనను అపహరించిన (Kidnap)వ్యక్తి అతనేనంటూ యాసిన్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరి రుబియా సయీద్ (Rubia sayeed) గుర్తుపట్టింది. అప్పట్లో రుబియాను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు ఐదుగురు టెర్రరిస్టులను విడుదల చేశారు. ఈ కిడ్నాప్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు రుబియా సయీద్ తొలిసారి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరైంది. నాటి కిడ్నాపర్లలో యాసిన్ మాలిక్‌తో పాటు మరో ముగ్గురిని ఆమె గుర్తుపట్టింది.


రుబియా సయీద్ కిడ్నాప్ కేసును 1990 ప్రధమార్థంలో సీబీఐ చేపట్టింది. ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్న సయీద్‌ పేరును ప్రాసిక్యూషన్ సాక్షిగా ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కేసులో యాసిన్ మాలిక్‌కు ఇటీవల జీవిత ఖైదు పడింది.

Updated Date - 2022-07-16T02:14:47+05:30 IST