Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాదాస్పద భూమిలో మెగాపార్కు

సర్వేనంబర్‌ 540లో నిర్మాణంపై రైతుల ఆగ్రహం

మరోమారు ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు, ప్రతిపక్షాలు


మఠంపల్లి, అక్టోబరు 9: దశాబ్దాల కాలంగా వివాదంలో ఉన్న భూమి.. ఆందోళనలు, రాస్తారోకోలు.. ప్రతిపక్ష నేతలపై పోలీసుల కేసులు.. అరె్‌స్టలు.. రాష్ట్రస్థాయి లో చర్చనీయాంశమైన సర్వేనంబర్‌.. ఆక్రమణలో ఉన్న వందల ఎకరాల భూమి నుంచి కబ్జాదారులను ఖాళీ చేయించి గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందిపోయి వివాదాస్పద భూమిలో అధికారులు మెగాపార్కు నిర్మాణానికి పూనుకున్నారు. దీంతో మరో కొత్తపంచాయితీకి తెరతీశారు. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధి గుర్రంబోడుతండాలోని సర్వేనంబర్‌ 540 అంటే నే అక్రమాల పుట్ట. ఈ విషయం తెలిసి కూడా, అధికారులు సుమారు రూ.50లక్షల వ్యయంతో మెగాపార్కు నిర్మాణానికి సిద్ధమయ్యారు.


ముంపు బాధితుల భూములు

నాగార్జునసాగర్‌ నిర్మాణ సమయంలో ముంపు బా ధితుల కోసం అప్పటి ప్రభుత్వం గుర్రంబోడు తండాలో 1470ఎకరాలు కేటాయించింది. అయితే పట్టా ఉన్న రైతుకు ఇక్కడ భూమి లేదు. భూమి ఉన్న రైతులకు పట్టా లేదు. అంతేగాక వందల ఎకరాల భూమి బడాబాబుల ఆక్రమణలో ఉంది. వారి నుంచి భూములు ఇప్పించాలని గిరిజన రైతులు ఏళ్లుగా పోరాడుతున్నా రు. వీరికి ప్రతిపక్ష పార్టీలు, గిరిజన కుల సంఘాలు అండగా నిలిచాయి. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన చలో గుర్రంబోడుతండా ఉద్రిక్తంగా మారి నేతలపై కేసులు నమోదయ్యాయి. సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, తానే దగ్గరుండి భూహక్కులు కల్పిస్తానని చెప్పిన కలెక్టర్‌ హామీ నేటికీ నెరవేరలేదు. 540సర్వేనంబర్‌లో అటవీ, ప్రభుత్వ, ఢీపారెస్ట్‌, పట్టా భూమి లెక్కతేల్చి ఆక్రమణలను తొలగిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినా అదీ నెరవేరలేదు.


మెగాపార్కుకు స్థలం కేటాయింపు

భూ వివాదం అలాగే ఉండగా, అధికారులు మెగాపార్కు నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఏళ్లుగా భూముల పై హక్కు కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన పట్టించుకోనివారు మెగాపార్కు నిర్మా ణం కోసం వారం రోజుల్లోనే పది ఎకరాల భూమి ఎలా కేటాయిస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక పార్కు నిర్మాణానికి హక్కు పత్రాలు ఇవ్వడం, హద్దులు ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మేజర్‌ పంచాయతీలు, ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నా, వాటిని వదిలి మారుమూల తండాలో వివాదంలో ఉన్న భూమిలో మెగాపార్కును ఏర్పాటు చేయ డం గిరిజనుల్లో చిచ్చుపెట్టడమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంపు బాధిత రైతులకు భూమి కేటాయించిన సమయంలో సుమారు 20ఎకరాలు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌, మేరమ్మయాడి దేవాలయానికి ఇనాముగా ఇచ్చారు. ఇటీవల ఈ ఆల య ఉత్సవాల సందర్భంగా గుర్రంబోడుతండాలో ఘర్షణలు, దాడులు చోటుచేసుకున్నాయి. కాగా, ఆలయానికి చెందిన భూమిలో మెగాపార్కు ఏర్పాటు చేయడం భక్తుల మనోభావాలను కించపరిచేలా అధికారుల తీరు ఉంద నే అభిప్రాయలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యం లో మరోమారు ఉద్యమానికి ప్రతిపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా 540 సర్వేనంబర్‌ భూమి మొత్తా న్ని రీసర్వేచేసి ఆక్రమణలను తొలగించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని,ఆతరువాతే మెగాపార్కు నిర్మా ణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలమేరకే పార్కు :లక్ష్మణ్‌బాబు, తహసీల్దార్‌

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరుకు 540 సర్వేనంబర్‌లో మెగాపార్కుకు స్థలం కేటాయిం చాం. అటవీశాఖకు చెందిన భూమినే గుర్తించాం. ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి వివాదం లేనందున పార్కు నిర్మాణానికి కేటాయించాం. సర్వే, హద్దులు అటవీశాఖ చూసుకుంటుంది.


Advertisement
Advertisement