క్వాలిటీ మ్యాట్రిక్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-04-07T00:58:11+05:30 IST

నగరంలోని గచ్చిబౌలిలో క్వాలిటీ మ్యాట్రిక్స్ అధ్యక్షురాలు

క్వాలిటీ మ్యాట్రిక్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో క్వాలిటీ మ్యాట్రిక్స్ అధ్యక్షురాలు ప్రియాంక వల్లేపల్లి, శశికాంత్ వల్లేపల్లిల స్పాన్సర్ షిప్‌తో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఐటీ ప్రొఫెషనల్స్ ఫోరం, స్వేచ్ఛ మరియు సీసీసీకి చెందిన కిరణ్ చంద్రలు నిర్వహించారు.  గచ్చిబౌలితోపాటు పరిసర ప్రాంతాలలోని బస్తీలలో నివసించే 400 మంది భవన నిర్మాణ కార్మికులు, ఇతరులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఈఎన్‌టీ, ఆప్టోమెట్రీ విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలను డాక్టర్లు నిర్వహించారు. 400 మందికి రక్త పరీక్షలు, ఈసీజీ, ఇకో, షుగర్ పరీక్షలతోపాటు వివిధ రకాల పరీక్షలను వైద్యులు చేశారు. అంతేకాదు, వారందరికీ 6 నెలలకు సరిపడా విటమిన్ టాబ్లెట్స్‌తో పాటు సంబంధింత టాబ్లెట్లను ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వలంటీర్లను ప్రియాంక వల్లేపల్లి అభినందించారు.

Updated Date - 2022-04-07T00:58:11+05:30 IST