సత్వర కేసుల పరిష్కారానికి మెగా లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2022-08-14T05:14:26+05:30 IST

కేసుల సత్వర పరిష్కారానికి మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ఏ నర్సింహమూర్తి, జూనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌మిత్రా అన్నారు.

సత్వర కేసుల పరిష్కారానికి మెగా లోక్‌ అదాలత్‌
కోర్టు హాల్లో మాట్లాడుతున్న జడ్జి నర్సింహమూర్తి

హుజూర్‌నగర్‌, ఆగస్టు 13 : కేసుల సత్వర పరిష్కారానికి మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ఏ నర్సింహమూర్తి, జూనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌మిత్రా అన్నారు. పట్టణంలోని కోర్టు హాల్‌లో మెగా లోక్‌అదా లత్‌ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులనుద్ధేశించి వారు మాట్లాడారు. రాజీపడదగిన కేసులన్నీ లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కక్షలకు, కార్పణ్యాలకు పోవొద్దన్నారు. సహనంతో ఉంటే సమస్యలే ఉండవన్నారు. ప్రతిఒక్కరూ కేసులు పరిష్కరించుకుని ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. లోక్‌అదా లత్‌లో 55 క్రిమినల్‌ కేసులు, ఆరు సివిల్‌ కేసులు రాజీపడగా వాటిని కొట్టివేశారు. 15 కేసుల్లో నిందితులకు రూ.2.50 లక్షలు జరిమానా విధించగా, చెల్లించారు. కార్యక్రమంలో లోక్‌ అధాలత్‌ సభ్యులు చెన్నగాని యాదగిరి, ప్రవీణ్‌కుమార్‌, చల్లా కృష్ణయ్య, మద్దుల నాగేశ్వరరావు, కాల్వ శ్రీనివా్‌సనాయుడు, శ్రీనివా్‌సరెడ్డి, సత్యనారాయణ, సురేష్‌ నాయక్‌, అంజయ్య, వీరయ్య, వెంకటేష్‌, సురేష్‌, చంద్రయ్య, శ్యాం, రాము, రవి, శ్రావణ్‌, జానయ్య, రమణారెడ్డి, శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:14:26+05:30 IST