వాడీవేడీగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-11-25T05:13:29+05:30 IST

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ లలిత అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమా వేశం వాడీవేడీగా కొనసాగింది.

వాడీవేడీగా సర్వసభ్య సమావేశం

లోకేశ్వరం, నవంబరు 24: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ లలిత అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమా వేశం వాడీవేడీగా కొనసాగింది. అధికారుల తీరును ప్రజాప్రతినిధులు ఎం డగట్టారు. మొత్తం 29శాఖల నుంచి అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కొన్నిశాఖల అధికారులు గైర్హాజరు కావడంతో పాటు మరికొందరు వారి కిందిస్థాయి అధికారులను పంపారని, ప్రజల సమస్యలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. ముందుగా ఏఈవో మౌనిక తమ శాఖ ప్రగతి నివేదికలను వినిపిస్తుండగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగ్‌రావు కల్పించుకొని మొక్కజొన్న పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయక పోవడం వల్ల కొనుగోలు సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో కోతల వల్ల రైతులు నష్ట పోతున్నారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఏపీవో రమేశ్‌ తన నివేదికలను వినిపిస్తుండగా సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, ఎంపీటీజీ జీవన్‌లు కల్పించుకని ఏఏ గ్రామాల్లో ఏఏ పనులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి ప్రగతి నివేదికలను చెప్తుండగా కల్పించుకున్న జయసాగర్‌రావు నీటి సరఫరా ఎంత వరకు వచ్చిందని, ఎప్పుడు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వరని మం డిపడ్డారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ద్వారా 50రిజిస్ర్టేషన్‌లు జరిగాయని, సాదాబైనామా ద్వారా 500దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నా రు. ఆన్‌లైన్‌ ప్రారంభం కాగానే మల్కాపూర్‌ శివారంలోని సర్వే నెం.148   రైతులకు పట్టాపాస్‌ పుస్తకాలను అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ వచ్చే సర్వసభ్య సమావేశానికి ఈ సమావేశంలో అడిగిన సమస్యలు ఎంత వరకు పరిష్కరించారో వాటికి సంబంధించిన పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆదేశించారు.

Updated Date - 2020-11-25T05:13:29+05:30 IST