Abn logo
Jun 15 2021 @ 11:38AM

ఏకంగా 23 మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. గిన్నీస్‌బుక్ రికార్డు..

జియోనా చానా.. మిజోరాంకు చెందిన 76 ఏళ్ల ఈ తాత చనిపోయాడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంతాపం తెలిపారు. అంత పాపులర్ అయిన ఈ తాత చేసిన గొప్ప పనేంటో తెలుసా? 38 పెళ్లిళ్లు చేసుకోవడం. జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. మనుమలు, మనవరాళ్లు, కోడళ్లను కలుపుకుంటే ఈయన కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న జియోనా చానా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనపై డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఈ విషయం తెలిశాక చాలామందికి ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న మహిళ ఎవరు? అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలగడం సహజం. అయితే ఆమె మనదేశంలో లేదులెండి.


లిండా లో టేలర్ వుల్ఫ్.. ఈమే ప్రపంచంలో అత్యధిక సార్లు పెళ్లి చేసుకున్న మహిళ. ఆమె ఇప్పటి వరకూ 23 మందిని పెళ్లి చేసుకుంది. వీరిలో మోసగాళ్లున్నారు. నేరస్థులున్నారు. మతబోధకులు ఉన్నారు. గేలు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు. ఆమెను కొట్టి హింసించిన వాళ్లున్నారు. జీవితంలో ఏమీ లేక ఆమె వద్దే స్వాంతన పొందిన వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యధికసార్లు పెళ్లి చేసుకున్న మహిళగా గిన్నిస్ రికార్డును కూడా ఈ 68 ఏళ్ల బామ్మ క్రియేట్ చేసింది. ప్రస్తుతం తన శేష జీవితాన్ని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గడుపుతోంది. ఆమె చేసుకున్న చివరి పెళ్లి 1996లో గ్లిన్ ‘స్కాటీ’ వుల్ఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.


గ్లిన్‌ను పెళ్లి చేసుకోవడానికి వీరిద్దరి మధ్య ప్రేమ ఏమీ లేదు. గ్లిన్ అప్పటికే 28 పెళ్లిళ్లు చేసుకున్నారు. 29వ పెళ్లి కూడా చేసుకొని రికార్డు సృష్టించడం కోసం లిండాను వివాహమాడారు. పెళ్లయిన ఏడాదికే 1997లో గ్లిన్ కన్నుమూశారు. లిండా తొలిసారి 1957లో 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుందట. ఆమె తొలిభర్త జార్జ్ స్కాట్ వయసు అప్పటికే 31. ఏడేళ్లపాటు వీళ్ల సంసారం సాగింది. ఆమె జీవితంలో ఇదే సుదీర్ఘ వైవాహిక జీవితం. ఇలా అత్యధిక పెళ్లిళ్ల రికార్డు సృష్టించిన ఆమె.. ‘‘నేను వయసులో ఉన్నప్పుడు అందరిలాంటి దాన్నే. కానీ చుట్టుపక్కల ఉండే అబ్బాయిలందరూ నన్ను ప్రేమించారు. వాళ్లందరూ నన్ను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు’’ అని నవ్వుతూ చెప్తుంటుందీ బామ్మ.


ప్రత్యేకంమరిన్ని...