Abn logo
Jul 28 2021 @ 00:10AM

నీట్‌లో ఓబీసీలకు న్యాయం జరిగేలా చూడాలి

బీసీ కమిషన్‌ చైర్మన్‌కు వినతి పత్రం అందజేస్తున్న డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు తదితరులు

జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌కు విజ్ఞప్తి

గుంటూరు(విద్య),జులై 27: జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌లో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నేషనల్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ భగవాన్‌లాల్‌కు మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, డాక్టర్‌ పి.సీతారామ్‌ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు  సోమవారం ఢిల్లీలోని బీసీ కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 15శాతం రిజర్వేషన్స్‌ న్యాయబద్ధంగా అమలు చేయలేని కేంద్రం 100శాతం సీట్లు అప్పగిస్తే ఏవిధమైన న్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు అంగిరేకుల  వరప్రసాద్‌ యాదవ్‌, లక్ష్మీనరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.