ఆయుర్వేద పూర్వ వైభవం కోసమే వైద్య శిబిరాలు

ABN , First Publish Date - 2022-05-25T05:23:53+05:30 IST

తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌నాయక్‌, రీజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ రవినాయక్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

ఆయుర్వేద పూర్వ వైభవం కోసమే వైద్య శిబిరాలు
తూప్రాన్‌ ఆయుర్వేద మెగా వైద్య శిబిరంలో మందులను పంపిణీ చేస్తున్న సిబ్బంది

మెగా శిబిరంలో వైద్యుల వెల్లడి

తూప్రాన్‌, మే 24:  తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌నాయక్‌, రీజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ రవినాయక్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి ఆదేశాల మేరకు తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో మంగళవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు.  అసిస్టెంట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌నాయక్‌, రీజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ రవినాయక్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌ మంగళవారం మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. గైనిక్‌, అర్షమొలలు, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, పంచకర్మ తదితర చికిత్సలు నిర్వహించగా, 520 మంది రోగులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. రోగుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేయడంతోపాటు, ఉచితంగా అయుర్వేద మందును అందజేశారు. వైద్య శిబిరంలో ప్రొఫెసర్లు గణేశ్వర్‌రెడ్డి, లక్ష్మీకాంతం, సునీతాజోషి, శ్రీధర్‌, జోహార్‌, అరుణగాయత్రీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లక్ష్మి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పద్మప్రియ, తేజారాం, అరుణ, వైద్యాధికారులు లక్ష్మీనారాయణ, నమ్రత, విజిత, మల్లికార్జున్‌, లావణ్య, సబితా, రజని, విజేత, ఫార్మసిస్టు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:23:53+05:30 IST