Medak: కుటుంబసభ్యులతో కలిసి కానిస్టేబుల్ ఆందోళన

ABN , First Publish Date - 2022-03-22T17:19:43+05:30 IST

జిల్లాలోని ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ నాజంనాయక్ కుటుంబసభ్యులతో సహా ఆందోళనకు దిగారు.

Medak: కుటుంబసభ్యులతో కలిసి కానిస్టేబుల్ ఆందోళన

మెదక్: జిల్లాలోని ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ నాజంనాయక్ కుటుంబసభ్యులతో సహా ఆందోళనకు దిగారు. తనను అకారణంగా సస్పెండ్  చేశారంటూ ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడతానంటూ కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అధికారులు కానిస్టేబుల్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఇటీవల పోలీస్‌‌స్టేషన్ నుంచి ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌కు తన బదిలీపై వాట్సాప్ గ్రూప్‌ల్లో నాయక్ పోస్టు చేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-03-22T17:19:43+05:30 IST