‘దివ్యాంగులకు ఉపకరణాలు’

ABN , First Publish Date - 2020-02-20T07:11:03+05:30 IST

జిల్లా పరిధిలోని మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలోని వికలాంగులకు అవసరమైన ఉపకరణాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు ఏఐఎల్‌ఎంసీవో కాన్పూర్‌వారి సౌజన్యంతో ప్రత్యేక శిబిరాలు

‘దివ్యాంగులకు ఉపకరణాలు’

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19 : జిల్లా పరిధిలోని మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలోని వికలాంగులకు అవసరమైన ఉపకరణాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు ఏఐఎల్‌ఎంసీవో కాన్పూర్‌వారి సౌజన్యంతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా ప్రణాళిక శాఖ, పౌరసంబంధాల, మెప్మాశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, కౌడిపల్లి, నర్సాపూర్‌లో వికలాంగులకు అవసరమైన ఉపకరణాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు మార్చి 16 నుంచి 21 వరకు ఆరురోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు రసూల్‌బీ, వెంకటేశ్వర్‌రావు, రమేశ్‌కుమార్‌, ఉమాదేవి, శ్రీనివాసరావు, దేవయ్య, మల్లేశ్వరి, లక్ష్మి, ఏఎల్‌ఐఎంసీవో ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T07:11:03+05:30 IST