Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఎమ్మెల్యే జగన్మోహనరావు

కంచికచర్ల రూరల్‌ : రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు. మున్నలూరు, కునికెనపాడు, చెవిటికల్లు గ్రామాల్లోని రక్షితనీటి పథకాలను మంగళ వారం  పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో పథకాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రక్షిత  నీటిని అందించేలా కృషి చేస్తున్నామన్నారు. ఎంపీపీ మలక్‌బషీర్‌, జడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి, ఎంపీడీవో శిల్ప, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement