Abn logo
Jul 30 2021 @ 23:48PM

అర్హులకు పథకాలు అందేలా చర్యలు

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

పలాస రూరల్‌: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  కోరారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలతో  సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలను సచివాలయం ఉద్యోగులు అందుకోకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అనంతరం జేసీ సుమిత్‌కుమార్‌ సమస్యలు పరిష్కరించేందుకు సచివాలయ ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. చైర్మన్‌ బల్ల గిరిబాబు పాల్గొన్నారు.