నేరాల నియంత్రణకు చర్యలు

ABN , First Publish Date - 2022-01-18T05:09:05+05:30 IST

నేరాల నియంత్రణకు చర్యలు

నేరాల నియంత్రణకు చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

  • చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా 
  • ఫిర్యాదుదారులు నన్ను నేరుగా కలువొచ్చు
  • చౌడాపూర్‌లో త్వరలో పీఎస్‌ ఏర్పాటు
  • కారాబాద్‌ ఎస్పీ  నంద్యాల కోటిరెడ్డి

పరిగి: వికారాబాద్‌ జిల్లాలో నేరాల నియంత్రణ, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కొత్తగా ఎస్పీగా నియమితులైన ఆయన మొదటిసారి పరిగి పీఎస్‌, సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో సమావేశమయ్యారు. కేసుల అదుపు, ఇతర ఆంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సంఘ విద్రోహుల పై చర్యలు తప్పవన్నారు. నేరాలను అదుపు, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యం అని తెలిపారు. తాండూరు, వికారాబాద్‌లలో ట్రాఫిక్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబ ర్‌ నేరగాళ్లను గుర్తించేందుకు జిల్లా కేంద్రానికి సైబర్‌ల్యాబ్‌ను తెచ్చామన్నారు. ఒక వ్యక్తిపై రెండుకంటే ఎక్కువసార్లు కేసు నమోదైతే రౌడీషీట్‌, పిడియాక్ట్‌ నమోదుకు వెనుకాడం అని స్పష్టం చేశారు. కత్తులు, ఇతర మరణాయుధాలతో తిరిగినా, గొడవల్లో తలదూర్చినా వదిలే ప్రసక్తేలేదన్నారు. చౌరస్తాలు, గ్రామ కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీని కోసం వ్యాపారులు, ప్రజాప్రతినిఽధుల సహకారం తీసుకుంటామన్నారు. నేరగాళ్ల జియోట్యాగింగ్‌ చేస్తున్నామని, వారు ఎక్కడికి వెళ్లినా సమాచా రం వెంటనే తెలిసేలా టెక్నాలజీనీ ఉపయెగిస్తున్నట్లు తెలిపారు. బీజాపూర్‌-హైదరాబాద్‌ హైవేపై 24గంటలూ నిఘా ఉంచుతామన్నారు. ప్రమాదా ల నివారణకు మన్నెగూడ-రావులపల్లి వరకు రెండు వాహనాలతో పెట్రోలి ంగ్‌ నిర్వహిస్తామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలపాలపై ఎన్ఫోర్స్‌మెంట్‌ బృ ందాలతో నిఘా ఉంచామని చెప్పారు. బాధితులు ఎవరైనా తనను నేరుగా కలిసి సమస్య తెలుపుకోవచ్చన్నారు. తప్పుడు ఫిర్యాదులు, సమాచారం ఇ వ్వకూడదని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుందన్నారు. రాత్రిళ్లు ప్రతీ పీఎస్‌ పరిధిలో నిఘా పటిష్టం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసులపై, ఆత్మహత్యల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు ప్రజలు, పోలీసులు కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ జి.శ్రీనివాస్‌, సీఐ వెంకటరామయ్య, ఎస్సైలు విఠల్‌రెడ్డి, శ్రీశైలం, రమేశ్‌, గిరి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:09:05+05:30 IST