Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు

సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

టెక్కలి: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఆదేశించారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో డివిజన్‌స్థాయి రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొను గోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ-క్రాప్‌ విధానం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 20 రోజుల్లో రైతు ఖాతాలకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పక్క రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా మేనేజర్‌ శాంతకుమారి,   ఏడీఏ బీవీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement