Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోంగార్డుల సంక్షేమానికి చర్యలు

  అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ

విజయనగరం క్రైం, నవంబరు 22 : హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ అన్నారు. జిల్లా పోలీసు కార్యా లయం సమీపంలోని దండుమారమ్మ కళ్యాణ మండపంలో హోంగార్డులతో సోమవారం నిర్వహించిన దర్బార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోంగా ర్డులకు ఎలాంటి సమస్య ఉన్నా సందేహం లేకుండా నేరుగా తన నంబర్‌ 9440906254కు ఫోన్‌ లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించవచ్చునన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి తానే స్వయంగా అవసరమైన సహాయం అందించేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఎస్పీ దీపికాపాటిల్‌ మాట్లాడుతూ హోంగా ర్డులెవరైనా అర్ధాంతరంగా మృతి చెందినట్లయితే ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకు నేందుకు హోంగార్డుల వేతనంతో పాటు పోలీసు సిబ్బంది అందించే మొత్తాన్ని చేయూతగా అందిస్తున్నామన్నారు. దర్బార్‌కు హాజరైన పలువురు హోంగా ర్డులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం పొందేలా చూడాలని కోరారు. తెల్ల రేషన్‌ కార్డు, ఇంటి స్థలం, ఐడీ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ సత్యనారాయణరావు, హోంగార్డు కమాం డెంట్‌ చంద్రబాబు, డీఎస్పీలు శేషాద్రి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.  Advertisement
Advertisement