Abn logo
Sep 17 2021 @ 23:31PM

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న చైర్మన్‌ కొండల్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ : మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో రూ.30లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్‌ మహేష్‌, ఏఈ నరేష్‌, సురేందర్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.