Abn logo
Sep 24 2020 @ 05:42AM

మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.33.77 లక్షలు

Kaakateeya

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 23 : మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించగా 33,77,317 రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాద్‌ తెలిపారు.


75 రోజులకుగాను హుండీలను లెక్కించగా నగదుతోపాటు 22 గ్రాముల 400 మిల్లీగ్రాముల  బంగారం, 151 గ్రాముల 300 మిల్లీ గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయని అన్నారు. హుండీ లెక్కింపును దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement