Viral: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఫోన్ చేయకండి.. షాక్ ఇస్తున్న మ్యాట్రిమోనియల్ సైట్ ప్రకటన!

ABN , First Publish Date - 2022-09-20T02:12:38+05:30 IST

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లను చాలా వరకు మ్యాట్రిమోనియల్ సంస్థలే కుదురుస్తున్నాయి.

Viral: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఫోన్ చేయకండి.. షాక్ ఇస్తున్న మ్యాట్రిమోనియల్ సైట్ ప్రకటన!

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లను చాలా వరకు మ్యాట్రిమోనియల్ సంస్థలే కుదురుస్తున్నాయి. ఆయా సైట్లకు డబ్బులు కట్టి రిజిస్టర్ అయితే చాలు.. నిశ్చింతగా ఇంట్లో కూర్చుని పెళ్లి కుదుర్చుకోవచ్చిన పెద్దలు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో కనిపించే ప్రకటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వరుడు లేదా వధువు తరఫు వారి ఆకాంక్షలు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఓ యాడ్ (Matrimonial Ad) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ను కనుగొన్న జైపూర్ విద్యార్థి.. రూ.38 లక్షల రివార్డుతో సత్కారం!


Samir Arora అనే వ్యక్తి ఆ ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. `హిందూ పిళ్లై కుటుంబానికి చెందిన, ధనవంతురాలైన ఎమ్‌బీఏ చదివిన యువతికి అదే కులానికి చెందిన వరుడు కావలెను. ఐపీఎస్/ఐయేఎస్, డాక్టర్, వ్యాపారవేత్త వృత్తుల్లో ఉన్న వారికే ప్రాధాన్యం` అని ఆ ప్రకనటలో పేర్కొన్నారు. అయితే ఆ ప్రకటన చివర్లో `దయచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software Engineers) కాల్ చేయకండి` అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. `సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మీద ఆ కుటుంబానికి ఎందుకంత కోపం` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Updated Date - 2022-09-20T02:12:38+05:30 IST