గ్రామాల్లో మట్కా దందా

ABN , First Publish Date - 2022-04-25T07:27:39+05:30 IST

మహమ్మరి మట్కా మళ్లీ గ్రామాలకు పాకుతోంది. పలు గ్రామాల్లో ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. లక్షల రూపాయలు చేతులు మారుతూ ఏజెంట్ల జేబులు నింపుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మండలంలో పోచంపాడ్‌, నెహ్రూనగర్‌ గ్రామంలో తిరిగి మట్కా ఆట విజృంభిస్తోంది.

గ్రామాల్లో మట్కా దందా
పోచంపాడ్‌లో ఇటీవల మట్కా చిట్టీలు, డబ్బులు స్వాధీనం చేసుకున్న ఎస్సై(ఎస్సై)

పల్లెల్లో ఏజెంట్లతో జోరుగా సాగుతున్న వైనం

సామాన్య ప్రజల జేబులకు చిల్లు 

నిత్యం పెరిగిపోతున్న మట్కా బానిసలు

మెండోర, ఏప్రిల్‌ 24: మహమ్మరి మట్కా మళ్లీ గ్రామాలకు పాకుతోంది. పలు గ్రామాల్లో ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. లక్షల రూపాయలు చేతులు మారుతూ ఏజెంట్ల జేబులు నింపుతూ ప్రజల  జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మండలంలో పోచంపాడ్‌, నెహ్రూనగర్‌ గ్రామంలో తిరిగి మట్కా ఆట విజృంభిస్తోంది. మట్కా ఆటకు సామాన్య ప్రజలు బానిసలవుతూ పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని అత్యాశకు పోయి డబ్బులను ఏజెంట్ల చేతిలో పెడుతున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి పది వేల రూపాయలను ఏజెంట్లు కమీషన్‌లతో చెల్లిస్తున్నారు. నెంబర్‌ల మాయలో పడి మట్కా ప్రపంచంలో మట్కారాయుళ్ల చేతికి చిక్కి నష్టపోతున్నా రు. చివరకు తమ కుటుంబాలను అతలాకుతలం చేసుకుంటున్నారు.

కూలీ నుంచి ఉద్యోగస్తుల వరకు బానిసలే..

నిత్యం కూతీ చేసుకునే వారి నుంచి మొదలుకొని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మట్కా ఆటకు బానిసలవుతున్నారు. రోజూ వచ్చే డబ్బులను మట్కా ఆటలో పెట్టి సాయంత్రం, అర్ధరాత్రి వరకు వేచి చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆశలు ఆవిరై తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు. మట్కా బాధి తులు, యువకులు డబ్బులు కమీషన్‌ల రూపంలో వస్తాయ న్న ఆశతో మట్కా నిర్వాహకులు చేతిలో ఎంతో మంది బంధీలవుతున్నారు. నిరుద్యోగులు, ఖాళీగా ఉన్న వారు డబ్బు లు అలవోకగా వచ్చే అవకాశాలు వెతుకుంటూ మట్కా ఏజెం ట్లుగా మారుతున్నారు. ఈ మట్కా దందాలో యువకులు ఎక్కువుగా బలవుతున్నారు. ప్రజలు ఆర్ధికంగా వృద్ధి చెందా లని ప్రభుత్వం సంక్షేమ పథకాలతో సబ్సిడీ రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా.. కొందరు సునాయసంగా డబ్బులు సంపాదించేందుకు ఈ అవకాశాలను వెతుకుంటున్నారు. మట్కా ఆటకు బానిసలైన కొందరు నిత్యం వచ్చే డబ్బులను పూర్తిగా మట్కా ఆటలో వినియోగిస్తున్న జేబులకు చిల్లులు పడేలా చేసుకుంటున్నారు. కుటుంబాలను బాధల సుడి గుండంలో నెట్టేస్తున్నారు. పది రేట్లు వచ్చే డబ్బు మోజులో పడి వారి కాయకష్టం మరిచి మట్కా ఆటలో డబ్బును వృథా చేసుకుంటున్నారు.  

అధికారులు అవగాహన కల్పించాలి

ప్రజలు బాధపడుతున్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న అధికారులు అవగాహన కల్పించి మట్కా పట్ల అధికారులు కఠిన చర్యలు తీ సుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యం గా యువకులు ఈ ఆటకు బానిసలవుతుంటే తల్లిదం డ్రులు వారిని చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.   మండలంలో మట్కా ఆటకు చెక్‌ పెట్టి మట్కా రాయుళ్ల కు గ్రామ బహిష్కరణ చేయాలంటున్నారు. 

 ఇటీవలే పట్టుబడ్డ మట్కా రాయుళ్లు

 మండలంలో పోచంపాడ్‌, నెహ్రునగర్‌ కాలనీల్లో ఇటీవల మట్కారాయుళ్లను ఎస్సై శ్రీనివాస్‌యాదవ్‌ పక్కా ప్రణాళిక తో పట్టుకొని రూ.లక్ష నగదు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు. ఇటీవల మట్కా ని ర్వాహకులను తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేసిన గానీ మట్కా విజృంభిస్తున్నే ఉంది. పోచంపాడ్‌ నెహ్రూనగర్‌లో  ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చిన వారు ఈ ఆటకు బానిసలుగా మారడం గమనార్హం. 

కఠిన చర్యలు : శ్రీనివాస్‌యాదవ్‌, ఎస్సై

మట్కా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్‌యాదవ్‌ హెచ్చరించారు. యువకులు చెడు అ లవాట్లకు దూరంగా ఉండాలని, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-25T07:27:39+05:30 IST