మత్స్యకారుల సంక్షేమానికి సర్వే

ABN , First Publish Date - 2021-03-02T05:47:27+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మత్య్సకారుల సంక్షేమం కోసం ఎపిలిప్‌ ప్రాజెక్టు ద్వారా బేస్‌లైన్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు రాష్ట్ర కో-ఆర్టినేటర్‌ సురేష్‌ అన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి సర్వే
మత్స్యకారులతో మాట్లాడుతున్న ఎపిలిప్‌ రాష్ట్ర కోఆర్టినేటర్‌ సురేష్‌

 మనుబోలు, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా మత్య్సకారుల సంక్షేమం కోసం ఎపిలిప్‌ ప్రాజెక్టు ద్వారా బేస్‌లైన్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు రాష్ట్ర కో-ఆర్టినేటర్‌ సురేష్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మనుబోలు గిరిజనుల చేపల సొసైటీ సభ్యులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ఇప్పటివరకు ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయి, ఇంకెలాంటి సౌకర్యాలు కల్పించాలో నమోదు చేసుకుంటున్నామన్నారు. వలలు, సైకిళ్లు... ఇలా ఏమేం కావాలి, చేపలు పట్టిన తరువాత అందుబాటులో మార్కెటింగ్‌ సదుపాయం ఉందా, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సరిపడా ఆదాయం వస్తుందా ? అనే వివరాలను రాబట్టారు. అలాగే చేపలు పట్టుకునే చెరువులు చుట్టూ సరిహద్దు ఉందా, ఆక్రమణలకు గురైందా, చెరువుల్లో సొసైటీ సభ్యులు కాకుండా ఇతరులు పడుతున్నారా..? అడిగి తెలుసుకున్నారు. సర్వే నివేదికను అందిస్తే  భవిష్యత్తులో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.  కార్యక్రమంలో ఎపిలిప్‌ క్షేత్రాధికారి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:47:27+05:30 IST