ఆలయాలకు భారీగా తగ్గిన ఆదాయం

ABN , First Publish Date - 2020-09-20T09:20:47+05:30 IST

యాదగిరిగుట్ట నృసింహుడు రూ.24.01కోట్లు, చెర్వుగట్టు రామలింగేశ్వరు డి ఆలయం రూ.3.42 కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయి...

ఆలయాలకు భారీగా తగ్గిన ఆదాయం

యాదాద్రి, (ఆంధ్రజ్యోతి)/నార్కట్‌పల్లి

ఆలయాలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా ఆరు మాసాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రధానం గా యాదగిరిగుట్ట నృసింహుడు రూ.24.01కోట్లు, చెర్వుగట్టు రామలింగేశ్వరు డి ఆలయం రూ.3.42 కోట్ల ఆదాయాన్ని కోల్పోయా యి. దీంతో ఉద్యోగుల జీతభత్యాలకు కటకట ఏర్పడిం ది. యాదాద్రిలో కరోనా ప్రారంభమైన మార్చి నుంచి ఆగస్టు 31 వరకు ఆరుమాసాల వ్యవధిలో వివిధ కైంకర్యాల ద్వారా రూ.7,81, 35,854 ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో స్వామివారికి రూ.31,82,91,108 ఆదాయం వచ్చింది. గత  ఏడాది కంటే ఈ ఏడాది రూ.24,01,55,254 ఆదాయం తగ్గింది. ఇక చెరువుగట్టులో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.4,22,02,114 ఆదాయం రాగా, ప్రస్తుత ఏడాది అదే సమయంలో రూ.79,35,964లు మాత్రమే సమకూరా యి. మొత్తంగా రూ.3,42,66,150 ఆదాయాన్ని చెర్వుగట్టు దేవస్థానం కోల్పోయింది. కరోనా నియంత్రణలో భాగంగా యాదాద్రిలో ఈ ఏడాది మార్చి 17 నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. కొవిడ్‌-19 నియంత్రణలు పాటిస్తూ జూన్‌ 8న ఆలయాలను ప్రారంభించారు. భక్తులకు దర్శనాలు ప్రారంభించినా, ప్రత్యక్ష ఆర్జిత సేవలపై ఆంక్షలు విధించి ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించిన ఏకాంత పూజలు, మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తుల దర్శనపై ప్రభావం పడింది. ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు మూడు రోజులు దర్శనాలు నిలిపివేశారు. యాత్రీకుల రద్దీ కారణంగా కరోనా పెరుగుతుందన్న ఆందోళనలతో  స్థానికంగా ఈనెల 10 నుం చి 25వ తేదీ వరకు స్వచ్ఛందలాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. అయితే ఏటా మార్చి నుంచి ఆగస్టు మాసం వరకు యాదాద్రికి యాత్రీకుల సందర్శన ఎక్కువగా ఉంది రద్దీ ఏర్పడేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా తగ్గి లక్ష్మీనరసింహుడి సన్నిధి వెలవెలబోతోం ది. ఇది ఆదాయం ప్రభావం చూపగా, ఆర్థికలోటు ఏర్పడింది. యాదాద్రి ఆలయ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.2కోట్ల వరకు జీతభత్యాలు, మరో రూ.1కోటి వర కు నిర్వహణ వ్యయం ఉంటుంది.


అయితే ఆలయ ఖజనాలో ఉన్న నగదు నిల్వలతో ఆగస్టు మాసం వరకు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించారు. ప్రస్తు తం ఖజానా ఖాళీకావడంతో సెప్టెంబరు నెల వేతనాల చెల్లింపులతో పాటు విద్యుత్‌ బిల్లులు, ప్రసాదాల తయారీ సరుకుల బిల్లుల వంటి అత్యవసరాలకు కాసుల కటకట ఏర్పడిందని ఆలయ అధికారవర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వామివారికి వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను విత్‌డ్రా చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతి కోసం ఆలయ అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వ అనుమతులు వస్తే సెప్టెంబరు జీతభత్యాలు చెల్లింపులు ఉంటాయి. ఇక నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం రూ.3.42కోట్లకు పైగా తగ్గింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదా ఉన్న ఈ దేవస్థానానికి సాలీనా రూ.10 నుంచి రూ.11కోట్ల మేర ఆదాయం వచ్చేది. ఇందులో ప్రధానంగా హుండీ, తలనీలాల సేకరణ, ప్రసాద విక్రయాల ద్వారా సమకూరే ఆదాయమే సింహభాగంగా ఉంటోంది. కాగా, గడచిన ఐదు నెలల కాలంలో రూ.79,35,964 ఆదాయం సమకూరింది. ఇది సగటున దేవాలయానికి ఒక నెలలో వచ్చే ఆదాయంతో సమానం. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.4,22,02,114 ఆదాయం వచ్చింది. దీనితో పోలిస్తే రూ.3,42,66,150ల ఆదాయాన్ని దేవస్థానం కోల్పోయింది.

Updated Date - 2020-09-20T09:20:47+05:30 IST