ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

ABN , First Publish Date - 2020-10-31T07:04:19+05:30 IST

మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను జిల్లా కేంద్రంలో శుక్రవారం ముస్లింలు భక్తిశ్రద్ధ లతో జరుపుకున్నారు. ఉదయం, సాయంత్రం మసీద్‌లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 30: మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను జిల్లా కేంద్రంలో శుక్రవారం ముస్లింలు భక్తిశ్రద్ధ లతో జరుపుకున్నారు. ఉదయం, సాయంత్రం మసీద్‌లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు. దివ్య ఖురాన్‌ పఠనంతోపాటు ముస్లిం పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం కావడంతో మరింత విశిష్టత సంతరిం చుకోగా ఉదయం నుంచే మసీద్‌లవద్ద సందడి కన్పించింది. పలుసామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహించారు.


ముస్లింల భారీ ర్యాలీ..

కార్ఖానగడ్డ, హుస్సేన్‌పురా వద్ద గల బొంబాయి స్కూల్‌ నుంచి ఫరీద్‌ బాబా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలు పతాకాలను చేతబూని ర్యాలీగా వెళ్లారు. కార్ఖానాగడ్డ వద్ద ప్రారంభమైన ర్యాలీ సవరన్‌స్ట్రీట్‌ వరకు కొనసాగింది. అక్కడి మసీద్‌లో ప్రార్థ నల అనంతరం ర్యాలీ కరీముల్లాషా దర్గా చేరింది. దర్గావద్ద పతాకాలను నిలిపి ప్రార్థనలు చేశారు. కార్యక్ర మాల్లో దర్గా ముతవల్లీ సయ్యద్‌ సులే మాన్‌ తవక్కలి, రాష్ట్ర మైనారిటి కార్పో రేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌, మాజీ డిప్యూటీమేయర్‌ అబ్బాస్‌షమీ, సిటీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఏ మోసిన్‌ పాల్గొన్నారు. 


భారీ బందోబస్తు..

కరీముల్లాషా దర్గాతో పాటు మసీద్‌లు, కీలకప్రాంతాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పికెటింగ్‌లు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు పలుమార్లు పరిస్థితులను సమీక్షించారు. ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్ళించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూశారు.

Updated Date - 2020-10-31T07:04:19+05:30 IST