chemical companyలో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు కార్మికులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-06-03T13:03:24+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలోని నందేసరి ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది...

chemical companyలో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు కార్మికులకు అస్వస్థత

వడోదర(గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలోని నందేసరి ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీపక్ నైట్రేట్ కెమికల్ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగడంతోపాటు దట్టమైన పొగ వ్యాపించడంతో కెమికల్ ఫ్యాక్టరీలో సమీపంలో నివాసముంటున్న 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వడోదర జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ చెప్పారు. అగ్నిప్రమాదం వల్ల పొగ వ్యాపించడంతో ఐదుగురు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు.


అగ్నిప్రమాదానికి ముందు కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు సంభవించింది. అధికారులు 10 అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను ఆర్పుతున్నారు. ఈ పేలుడు, అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, సహాయ పునరావాస పనులు చేస్తున్నామని వడోదర అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-06-03T13:03:24+05:30 IST